ఝార్సుగూడ: ఒడిశాలోని ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ చేతిలో బీజేపీ అభ్యర్థి తన్కదార్ త్రిపాఠీ 48 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీపాలీ దాస్ తండ్రి నబా కిషోర్ దాస్ ఈ ఏడాది జనవరిలో ఓ పోలీస్ ఆఫీసర్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తోపాటే ఈ నెల 10న ఝార్సుగూడ ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్‌కు మొత్తం 1,07,198 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి కేవలం 48,721 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి తరుణ్ పాండే కేవలం 4,496 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఒడిశా మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నబా కిషోర్ దాస్ గత జనవరిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లి కారు దిగుతుండగానే ఏఎస్ఐ స్థాయి పోలీస్ అధికారి అతనిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నబా దాస్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి ఉదయం కన్నుమూశారు.
#WATCH | “This is a victory of the people of Jharsuguda, of those who loved my father, of the Chief Minister, of the people and BJD and of everyone associated with my father. This is a victory of Naba Das..,” says Dipali Das, the BJD candidate & daughter of slain Odisha minister… https://t.co/KZbfeCArxP pic.twitter.com/Cw7V5s9B4n
— ANI (@ANI) May 13, 2023