దేశంలో ఎక్కడా వాక్ స్వాతంత్య్రం లేదు: మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని ఖర్గే ఆరోపించారు.
దేశంలో పార్లమెంట్లోపలగానీ, పార్లమెంట్ బయటగానీ వాక్ స్వాతంత్య్రం లేదని ఖర్గే మండిపడ్డారు. ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వాళ్లను జైలుకు పంపుతున్నారని విమర్శించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ అప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, పేదరికం పెరుగుతూనే ఉన్నదని దుయ్యబట్టారు.
సాహెబ్‌గంజ్ జిల్లా పాకూర్ పట్టణంలోని గుమానీ గ్రౌండ్లో 60 రోజులపాటు కొనసాగే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన ప్రసంగించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి వివరించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

