రాంచి: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని డుమ్రీ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ అభ్యర్థి, ఆ రాష్ట్ర మంత్రి బేబీ దేవి (Babi Devi).. AJSU పార్టీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి యశోదా దేవిపై 17,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
దాంతో JMM తోపాటు దాని మిత్రపక్షం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రెండు పార్టీల కార్యకర్తలు పటాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని బేబీ దేవి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గర ఆ పార్టీ అధ్యక్షుడు రాజేశ్ థాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.