రాంచీ : జార్ఖండ్ కార్మిక శాఖ మంత్రి, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్తా కుమారుడు ముకేశ్ కుమార్ భోక్తా ఛాత్రా జిల్లా కోర్టులో ప్యూన్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కొన్ని నెలల క్రితం ప్యూన్, దఫ్తరీ, ట్రెజరీ మెసెంజర్ వంటి ఉద్యోగాలకు ఈ కోర్టు అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. నవంబరు 30న జిల్లా ఎంపిక సంఘం తుది ఫలితాలను వెల్లడించింది. ప్యూన్ ఉద్యోగానికి 13 మంది ఎంపికయ్యారు. వీరిలో ముకేశ్ ఒకరు. ఎస్టీ కేటగిరీలో ఆయన ఎంపికయ్యారు.