Jharkhand Elections | రాంచీ, అక్టోబర్ 27: 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో 32 నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వారు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ 32 నియోజక వర్గాల్లో 26 ఎస్టీలకు రిజర్వ్ చేసినవి ఉన్నాయి. ప్రస్తుత సీఎం హేమంత్ సొరేన్, మాజీ సీఎం చంపయి సొరేన్ పోటీ చేస్తున్న స్థానాలు కూడా ఇందులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2.60 కోట్లు కాగా అందులో పురుషుల సంఖ్య 1.31 కోట్లు, మహిళల సంఖ్య 1.29 కోట్లు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.