Jharkhand Crisis | జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం.. ఢిల్లీకి గవర్నర్ బియాస్!
Jharkhand Crisis | జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రమేశ్ బియాస్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Jharkhand Crisis | జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రమేశ్ బియాస్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవాలని ఈసీ చేసిన సిఫారసు వార్తలపై స్పష్టత ఇవ్వాలని గురువారం అధికార యూపీఏ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కోరారు. ఆ మరునాడే గవర్నర్ రమేశ్ బియాస్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం మరింత అనుమానాలకు తావిస్తున్నది. త్వరలో సందేహాలన్నీ నివృత్తి చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే రాజ్‌భవన్ వర్గాలు మాత్రం.. వైద్య పరీక్షల కోసమే గవర్నర్ రమేశ్ బియాస్ ఢిల్లీకి వెళ్లారని, ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని చెప్పాయి.
లాభదాయక పోస్ట్‌ను కలిగి ఉన్నారన్న అభియోగంపై హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు గత నెల 25న ఈసీ సమాచారం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. నాటి నుంచి జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈసీ తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసిందని సమాచారం.
రాష్ట్రంలో రాజకీయ బేరసారాలను ప్రోత్సహించేందుకు గవర్నర్ బియాస్ ప్రయత్నిస్తున్నారని యూపీఏ భాగస్వామ్య పక్షాలు గత నెల 28న సంయుక్త ప్రకటనలో విమర్శించాయి. అందుకే ఈసీ సిఫారసుపై నిర్ణయాన్ని వెల్లడించడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నాయి. మహారాష్ట్రలో మాదిరిగానే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనుమానిస్తున్నది. అందుకోసం తమ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నదని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

