Widow Re-Marriage Scheme | రాంచి, మార్చి 7: వితంతువుల కోసం జార్ఖండ్ ప్రభుత్వం విప్లవాత్మ క పథకానికి శ్రీకారం చుట్టింది. ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని జా ర్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సొరే న్ ప్రారంభించారు. వితంతువులు మళ్లీ వివాహం చేసుకుంటే ఈ పథకం కింద రూ.2 లక్షల ప్రోత్సాహం ఇవ్వనున్నది.
దేశంలోనే ఇలాంటి పథకం మొదటిసారి తామే తీసుకువస్తున్నామని సీఎం చంపయీ పేర్కొన్నారు. వితంతవుల జీవితాలు ఆగిపోవద్దని, మళ్లీ పెండ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను కట్టే వారికి ఈ పథకం వర్తించదు.