Hemant Soren | ఝార్ఖండ్ మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణం కేసులో దాదాపు 6 గంటల పాటు విచారించిన అనంతరం ఆయన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి ముందే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. హేమంత్ సోరెన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు.