Jeweller Rapes Sales Girl | జ్యుయలరీ షాపులో పని చేసే యువతిపై.. యజమాని అత్యాచారం
Jeweller Rapes Sales Girl | జ్యుయలరీ షాపులో పని చేసే యువతికి స్కూటీ కొని ఇస్తానని యజమాని నమ్మించాడు. డ్రైవింగ్ నేర్పించే నెపంతో ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మైనర్ బాలిక ఫిర్యాదుతో ఆ నగల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: జ్యుయలరీ షాపులో పని చేసే యువతికి స్కూటీ కొని ఇస్తానని యజమాని నమ్మించాడు. డ్రైవింగ్ నేర్పించే నెపంతో ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. (Jeweller Rapes Sales Girl) బాధిత మైనర్ బాలిక ఫిర్యాదుతో ఆ నగల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ‘అశోకా జ్యువెలర్స్’ యజమాని అయిన అశోక్ కుమార్ రస్తోగి పలు జ్యుయలరీ షాపులు నిర్వహిస్తున్నాడు. ఒక షోరూమ్‌లో 15 ఏళ్ల బాలికను సేల్స్ గాల్గా నియమించుకున్నాడు.
కాగా, స్కూటీ నడపడం నేర్పిస్తానని చెప్పి ఆ యువతిని తన ఫామ్‌హౌస్‌కు అశోక్ కుమార్ తీసుకెళ్లాడు. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత స్కూటీ కొని ఇస్తానని నమ్మించాడు. ఆ బాలికను ఫామ్‌హౌస్‌లో నిర్బంధించి అత్యాచారం చేశాడు. షోరూమ్ వెనుక ఉన్న గదిలో కూడా ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపుతానని బెదిరించాడు.
మరోవైపు కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయాన్ని తన తండ్రికి ఆ బాలిక చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిత్తూర్లోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు రైడ్ చేశారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు, లైంగికపరమైన అశ్లీల వస్తువులను అక్కడ గుర్తించారు. నిందితుడు అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడు అశోక్ కుమార్ తన ఫామ్‌హౌస్‌ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నాడని పోలీస్ అధికారి ఆరోపించారు. గతంలో కూడా పంజాబ్‌కు చెందిన యువతిని షోరూమ్‌లో పని కోసం నియమించుకుని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టైన అశోక్ బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీస్ అధికారి వివరించారు. తాజాగా 15 ఏళ్ల బాలికను పనిలో కుదుర్చుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో అతడ్ని మళ్లీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

