Jet Airways | మళ్లీ ఎగరనున్న జెట్ ఎయిర్వేస్.. తొలి విమానం ఎప్పుడంటే..
రెండున్నరేళ్ల కిందట ఆర్థిక భారంతో సతమతమవుతూ తన విమానాలను గ్రౌండ్ చేసిన జెట్ ఎయిర్వేస్ ( Jet Airways ) మళ్లీ ఎగరడానికి సిద్ధమవుతోంది.

న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల కిందట ఆర్థిక భారంతో సతమతమవుతూ తన విమానాలను గ్రౌండ్ చేసిన జెట్ ఎయిర్వేస్ ( Jet Airways ) మళ్లీ ఎగరడానికి సిద్ధమవుతోంది. 2022 తొలి త్రైమాసికంలో తమ తొలి దేశీయ విమానాన్ని న్యూఢిల్లీ నుంచి ముంబై మధ్య నడపడానికి ప్లాన్ చేస్తున్నట్లు జలన్ కాల్రాక్ కన్సార్టియమ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు, ఎయిర్పోర్ట్ కోఆర్డినేటర్లతో కలిసి పని చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మూడేళ్ల తర్వాత మళ్లీ ఓ జెట్ ఎయిర్వేస్ విమానం గాల్లోకి ఎగరనుంది.
దీనికోసం చిన్న సైజు ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకు తీసుకునే పనిలో ఆ సంస్థ ఉంది. ఇక వచ్చే ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికంలో తక్కువ దూరం అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభిచాలని అనుకుంటున్నట్లు ఈ జలన్ కాల్రాక్ కన్సార్టియంలో మెజార్టీ వాటా ఉన్న యూఏఈ వ్యాపారవేత్త మురారీ లాల్ జలన్ వెల్లడించారు.
మూడేళ్లలో 50కిపైగా, ఐదేళ్లలో 100కుపైగా విమానాలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండేళ్లు గ్రౌండ్ అయిన ఓ ఎయిర్‌లైన్ మళ్లీ గాల్లోకి ఎగరడం ఏవియేషన్ చరిత్రలోనే తొలిసారి అవుతందని ఈ సందర్భంగా జలన్ చెప్పారు. ఇప్పటికే 150 మందికిపైగా ఉద్యోగులును ఈ సంస్థ రిక్రూట్ చేసుకోగా.. మరో 1000 మందిని తీసుకునే క్రమంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

