JEE Advanced 2023 | 2023-24 విద్యా సంవత్సరంలో దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థలు ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష (JEE Advanced Exam)కు అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆదివారం (ఏప్రిల్ 30) నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే ఏడో తేదీ వరకు విద్యార్థులు తమ పేర్ల రిజిస్ట్రేషన్‌కు తుది గడువు.
మే ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థులు ఫీజు పే చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ-మెయిన్ 2023 రెండో సెషన్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే వారు jeeadv.ac.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
జేఈఈ-మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకులు వచ్చిన విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్డ్ 2023 పరీక్ష రాసేందుకు అర్హులు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్ఫూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కే సంయుక్త ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్-2023 పరీక్ష ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ విద్యార్థులు రూ.1450, ఇతర విద్యార్థులు రూ.2900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.inను సందర్శించాలి.
* హోంపేజీలో జేఈఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి.
* న్యూ లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫామ్ పూరించడంతోపాటు అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
* ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఫామ్ సబ్మిట్ చేయాలి.
* తదుపరి రిఫరెన్స్ కోసం ఫామ్ డౌన్ లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకోవాలి.
* ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం : jeeadv.ac.in
* ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 30, ఆదివారం
* ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 2023 మే 7
* అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు తుది గడువు : 2023 మే 8 సాయంత్రం ఐదు గంటలు.
* 29 నుంచి జూన్ నాలుగో తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
* జూన్ నాలుగో తేదీన పరీక్ష జరుగుతుంది.
* జూన్ నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
* జూన్ 11న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. జూన్ 18న ఫలితాలు వెలువడతాయి.