Tejashwi Yadav : బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ చేతిలో జేడీయూ (JDU) ఇంకా ఎంతోకాలం ఉండదని ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. ప్రస్తుతం జేడీయూ నితీశ్ చేతిలో ఉన్నదని, ఇకముందు ఆ పార్టీ లలన్ సింగ్ (Lalan Singh), సంజయ్ ఝా (Sanjay Jha), విజయ్ చౌదరి (Vijay Choudhary) చేతుల్లోకి వెళ్లనుందని జోస్యం చెప్పారు.
ఆ ముగ్గురు నేతలూ ఎప్పుడో బీజేపీకి అమ్ముడు పోయారని, నితీశ్‌కుమార్‌ను సర్వనాశనం చేశారని తేజస్వి విమర్శించారు. రాఘోపూర్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాఘోపూర్ ప్రజలు తనపై విశ్వాసంతో ఇప్పటికే రెండుసార్లు గెలిపించారని, మూడోసారి కూడా గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
కాగా, బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనున్న స్థానాలకు మంగళవారం నామినేషన్లు మొదలయ్యాయి. వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో బిజీగా ఉన్నారు. ముఖ్యనేతల్లో రాఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్, లఖిసరాయ్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నామినేషన్లు వేశారు.