Sooraj Revanna | లైంగిక వేధింపులో కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(యూ) నేత సూరజ్ రేవన్నకు షాక్ తగిలింది. బెంగళూరు కోర్టు సూరజ్‌ను బెంగళూరు కోర్టు జూలై ఒకటి వరకు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. సూరజ్ రేవణ్ణ జేడీఎస్ కార్యకర్తను అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఈ నెల 23న పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేశారు. సూరజ్ రిమాండ్‌ను పొడిగించాలని సీఐడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కొద్దిరోజుల కిందట పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సూరజ్ రేవణ్ణపై కేసు నమోదైంది.
ఎమ్మెల్యే హెడీ రేవణ్ణ పెద్ద కొడుకైన సూరజ్ రేవణ్ణ జూన్ 16న గన్నికాడలోని ఫామ్‌హౌస్‌లో వేధింపులకు గురి చేసినట్లు కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను సూరజ్ ఖండించారు. తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. అనేక మంది మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు కస్టడీలో ఉన్నారు. జర్మనీ నుంచి వచ్చిన అనంతరం గత నెలలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రజ్వల్‌పై లైంగికదాడి, బెదిరింపు కేసులు నమోదయ్యాయి.