న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) భారీ జరిమానాలతో కూడిన కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ధర్నా చేసిన విద్యార్థులకు రూ.20 వేల వరకు జరిమానా విధించనున్నారు. తీవ్రతను బట్టి అతడి అడ్మిషన్‌ను రద్దు చేయనున్నారు.
హింసను పునరుద్ధరిస్తే రూ.30 వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎవరైనా విద్యార్థి ఇతర విద్యార్థి, సిబ్బంది, అధ్యాపకులపై భౌతిక దాడికి పాల్పడినా, దూషించినా అతడు రూ.50 వేల జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని వర్సిటీలో ప్రదర్శించిన తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి రావడం గమనార్హం.