Ayodhya Ram Mandir | 22నే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఎందుకు?
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆలయం ప్రాముఖ్యత, ప్రాణప్రతిష్ఠ ముహూర్తం, దర్శన వేళలు, మందిర నిర్మాణం
Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ, జనవరి 21: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆలయం ప్రాముఖ్యత, ప్రాణప్రతిష్ఠ ముహూర్తం, దర్శన వేళలు, మందిర నిర్మాణం.. ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు చూద్దాం..
ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఎప్పుడు?
సోమవారం(జనవరి 22న) మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 మధ్య జరుగుతుంది.
ఆలయ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?
డీడీ న్యూస్, డీడీ నేషనల్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దూరదర్శన్ ఈ లైవ్ ఫీడ్‌ను ఇతర వార్తా సంస్థలతో కూడా పంచుకుంటుంది. ఉదయం 11 గంటల నుంచి 1 వరకు జరిగే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
మందిరం దర్శన వేళలు ఎప్పుడు?
ప్రాణప్రతిష్ఠ తర్వాత జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి.
ప్రవేశ రుసుం ఉన్నదా?
భక్తులకు ఆలయ ప్రవేశం ఉచితం. పాస్‌లు పొందితే హారతి కార్యక్రమం కూడా ఉచితమే.
ప్రాణప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు?
పుష్య మాసం శుక్ల పక్షంలోని ద్వాదశి రోజు అయిన 2024, జనవరి 22వ తేదీని ట్రస్టు ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేసింది. ఈ రోజున మహావిష్ణువు సాగర మథనంలో సాయం చేసేందుకు తాబేలుగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ తేదీ మృగశిర నక్షత్రంలో ఉన్నది. ఇది మూడు శుభ యోగాలైన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగాలను తెస్తున్నది. కావున జనవరి 22వ తేదీ సాంస్కృతిక, పురాణ, ఖగోళ ప్రాముఖ్యం కలిగి ఉన్నది.
బాలరాముడి విగ్రహం పొడవెంత?
రామ్‌లల్లా విగ్రహం 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువు ఉంటుంది. ఐదేండ్ల వయసులోని బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కాడు.
మందిర శంకుస్థాపన ఎప్పుడు జరిగింది?
2020, ఆగస్టు 5న ప్రధాని హోదాలో మోదీ శంకుస్థాపన చేశారు.
నిర్మాణ పనులను ఎవరు పర్యవేక్షించారు?
రామాలయ నిర్మాణం, ఇతర నిర్వహణను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చూస్తున్నది. ఎల్అండ్టీ కంపెనీ నిర్మాణం చేస్తున్నది.
అయోధ్యకు ఎలా వెళ్లాలి?
యూపీలోని అయోధ్యకు వెళ్లేందుకు పలు రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. కొత్త ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి.
అయోధ్య రామాలయాన్ని ఎవరు డిజైన్ చేశారు?
దశాబ్దాల క్రితమే అయోధ్య రామాలయ డిజైన్‌ను ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

