శ్రీనగర్, అక్టోబర్ 19: జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారని శనివారం అధికారులు తెలిపారు.
గతంలో ఉన్న రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ గురువారం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, జమ్ముకశ్మీర్‌లో 370వ అధికరణ పునరుద్ధరణ కోసం కాకుండా కేవలం రాష్ట్ర హోదాపై మంత్రివర్గం తీర్మానం చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.