శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో జరిగిన పేలుడు ఘటన గురించి ఆ రాష్ట్ర డీజీపీ నళిన్ ప్రభాత్ మాట్లాడారు. నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో ఉగ్రవాద కోణం లేదన్నారు. ఇవాళ ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. నౌగామ్ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన FIR 162/2025 కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఆ కేసులో భాగంగా ఫరీదాబాద్ నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే నౌగామ్ పోలీసు స్టేషన్‌లోని ఓపెన్ ఏరియాలో సురక్షితంగా ఆ పేలుడు పదార్ధాలను పెట్టామని, అయితే వాటిని ఫోరెన్సిక్, కెమికల్ ఎగ్జామినేషన్‌కు పంపాల్సి ఉందన్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం రెండు రోజుల నుంచి అదే పనిలో ఉందన్నారు. చాలా సున్నితమైన పదార్ధాలు కావడంతో వాటిని ఎఫ్ఎస్ఎల్ టీమ్ జాగ్రత్తగా ప్యాక్ చేస్తోందన్నారు. కానీ దురదృష్టవశాత్తు శుక్రవారం రాత్రి 11.20 నిమిషాలకు పేలుడు సంభవించినట్లు డీజీపీ నళిన్ ప్రభాత్ తెలిపారు.
VIDEO | Srinagar: Addressing a press conference over Nowgam Police Station blast, Jammu and Kashmir DGP Nalin Prabhat says, “During the investigation, an FIR number 162/2025 of PS Nowgam, a huge quantity of explosive substances, chemicals were also recovered from Faridabad on 9,… pic.twitter.com/EoldKYsjfO
— Press Trust of India (@PTI_News) November 15, 2025