Supreme Court: బిల్కిస్ బానో రేపిస్టులు మళ్లీ జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court: బిల్కిస్ బానో రేప్ కేసులో రిలీజైన 11 మంది నిందితుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ నిందితులందరూ రెండు వారాల్లోగా మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ఇవాళ తన ఆదేశాల్లో పేర్కొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ సర్కార్ లాగేసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ నాగర్నత, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
న్యూఢిల్లీ: గుజరాత్ సర్కార్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు(Supreme Court). బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఆ కేసులో 11 మంది రేపిస్టులను ముందస్తుగా రిలీజ్ చేయాలన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను కోర్టు రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని ఇవాళ సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగర్నత, ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటీషన్‌కు అర్హత ఉందని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది.
రేప్ నిందితులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మహారాష్ట్ర సర్కారుకు ఉందని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచారణ జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో రేప్‌కు గురైంది. ఆ సమయంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్ష పడ్డ 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.
క్షమాభిక్ష ద్వారా రిలీజైన వారిలో జవ్వంత్ నాయి, గోవింద్ నాయి, శైలేశ్ భట్, రాథేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేశరిభాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బాకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మిటేశ్ భట్, రమేశ్ చందన ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత రిలీజైనట్లు గుజరాత్ హోంశాఖ కార్యదర్శి రాజ్ కుమార్ గతంలో తెలిపారు. రిలీజైన తర్వాత ఆ 11 మందికి హీరోల తరహాలో వెల్కమ్ దక్కింది. అయితే రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు మరికొంత మంది సుప్రీంను ఆశ్రయించారు.
ఇవాళ విచారణ సమయంలో జస్టిస్ నాగరత్న .. గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ అపహరించినట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. క్షమాభిక్షను ఇవ్వడం అంటే అధికారాలను గుజరాత్ సర్కార్ కిడ్నాప్ చేసినట్లే అని తెలిపారు. మహారాష్ట్ర అధికారాన్ని గుజరాత్ లాగేసుకున్నట్లు ఆమె తన తీర్పులో వివరించారు. అయితే గుజరాత్ సర్కార్ తన పరిధిలో ఉన్న అధికారాన్ని వాడుకున్నట్లు కోర్టు తెలిపింది. గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఈ తీర్పులో వెల్లడించింది.
ఒకవేళ రేప్ కేసు నిందితులు చట్టం ప్రకారం క్షమాభిక్ష పొందాలనుకుంటే, వాళ్లు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా మళ్లీ నిందితులందరూ జైలులో హాజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పును డ్రాఫ్ట్ చేసిన జస్టిస్ భుయాన్‌కు జస్టిస్ నాగరత్న థ్యాంక్స్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మనకు కేసీఆరే బాద్షా.. అమిత్ షానో, ఇంకో షానో తెలంగాణ ప్రజలకు అవసరం లేదు: కేటీఆర్
Vemulawada | వేములాడ ఆలయంపై ఏది నిజం.. గోపుర తొలగింపుపై 3 రకాల ప్రకటనలు?
Palnadu Water Grid | తెలంగాణకు ‘గర్భ’శోకం.. సాగరగర్భంలో ఆంధ్రా సర్జ్‌పూల్.. యుద్ధ ప్రాతిపదికన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు
Horoscope | 21-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
పల్నాడు వాటర్‌గ్రిడ్ అనైతికం.. ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ అనుమతి లేదు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

