న్యూఢిల్లీ : మాజీ ఎమ్మెల్యే పింఛన్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. జగదీప్ ధన్ఖడ్ 1993-1998 మధ్యకాలంలో రాజస్థాన్లోని కిషన్గఢ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2019 వరకు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, ఉప రాష్ట్రపతిగా నియమితులయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా జూలై 21న పదవికి రాజీనామా చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి ప్రభుత్వం రూ.3500 పెన్షన్ అందిస్తున్నది. ఈ క్రమంలోనే ధన్ఖడ్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్న తరుణంలో ఆయన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.