తప్పు మాట్లాడనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి..?
Ajay Rai | కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్ రాయ్
- స్మృతి ఇరానీపై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ స్పందన
లక్నో: కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్ రాయ్ సోమవారం కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ‘స్మృతి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. లట్కే & జట్కే చేస్తారు, వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు.
అజయ్ రాయ్ వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుపట్టారు. లోక్‌సభలో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను కించపరిచేలా మాట్లాడినందుకు అజయ్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ డిమాండ్‌పై అజయ్ రాయ్ స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
లట్కే & జట్కే అనేది తమ వ్యవహారిక భాషా పదమని, ‘ఏదో ఒకటి చెప్తారు, చేస్తారు’ అనేది ఆ పదానికి అర్థమని, అది అసభ్య పదజాలం, అనరాని వ్యాఖ్య ఎలా అవుతుందని అజయ్ రాయ్ ప్రశ్నించారు. తాను తప్పుడు మాటే మాట్లాడనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

