డెహ్రాడూన్: కొన్ని సందర్భాల్లో చిన్న ఘటన కూడా ప్రాణాలు తీస్తుంది. బాత్రూమ్లో కాలు జారిపడిన వారు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కోసారి ఎంత ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరుగని సందర్భాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయినా ( Car accident ) ప్రాణ నష్టం జరుగని ఘటనలు చాలా జరుగుతుంటాయి. కొన్ని ప్రమాదాల్లో సెకన్లలో చావు తథ్యమనే స్థితికి వెళ్లి కూడా కొందరు ప్రాణాలతో బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మన పట్టణంలో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు దిగి నదీలోయలోకి జారింది. కారు పడిన ప్రదేశం నుంచి మరో అడుగు ముందుకు జరిగినా నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయేది. కానీ కారు పడినచోటే ఆగిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఐటీబీపీ సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ కారులోని వ్యక్తిని రక్షించారు.