లక్నో : ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు (Azam Khan) సంబంధించిన నివాసాలు, పలు ప్రదేశాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు నిర్వహించారు. రాంపూర్, మీరట్, లక్నో, ఘజియాబాద్, షహరన్‌పూర్, సీతాపూర్ సహా ఎస్పీ నేతకు చెందిన పలు ప్రదేశాలు, నివాస సముదాయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఆజం ఖాన్ యూపీలోని రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్వేష ప్రసంగం కేసులో కోర్టు ఆజం ఖాన్‌కు మూడేండ్ల జైలు శిక్ష విధించడంతో గత ఏడాది అక్టోబర్‌లో యూపీ అసెంబ్లీలో ఆయన శాసనసభ్యత్వం రద్దయింది. అసెంబ్లీ సెక్రటేరియట్ ఆజం ఖాన్‌పై అనర్హత వేటు వేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భగా మిలక్ కొట్వాలి ప్రాంతంలో బహిరంగ సభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. వక్ఫ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే కేసులో అరెస్టయిన ఆజం ఖాన్‌కు గత ఏడాది మేలో అలహాబాద్ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఆజం ఖాన్ గతంలో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
Read More :
Rajasthan Road Accident | ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం