చండీగఢ్: జలియన్‌వాలా బాగ్( Jallianwala Bagh ) రెనోవేషన్పై కాంగ్రెస్‌లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తమ నేత రాహుల్ గాంధీ దీనిని విమర్శించిన కొన్ని గంటల్లోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏం తొలగించారో నాకు తెలియదు కానీ నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తోంది అని అమరీందర్ అనడం గమనార్హం. జలియన్‌వాలా బాగ్ కొత్త లుక్‌ను ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నేనో అమరవీరుడి కొడుకుని.. ఇలా అమరులకు అవమానం జరగడాన్ని సహించలేకపోతున్నాను అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇప్పుడా పార్టీ సీఎంయే రాహుల్‌తో పూర్తిగా విభేదించడం చర్చనీయాంశమైంది.
"I don't know what has been removed. To me it looks very nice," says Punjab CM Captain Amarinder Singh over the renovation of the Jallianwala Bagh pic.twitter.com/uM3aut0Opo
— ANI (@ANI) August 31, 2021