ఔరంగాబాద్: మహిళ అనుమతి లేకుండా ఆమె పాదం కానీ, శరీరంలోని ఏ భాగం తాకినా కానీ ఆమె మర్యాదకు భంగం కలిగించినట్టేనని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఆఖరికి అనుకోకుండా తగిలినా కూడా అది తప్పేనని పేర్కొంది. తనకు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఓ నిందితుడు వేసిన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ సెవ్లికర్ నేతృత్వంలోని బెంచ్ కొట్టేసింది. నిందితుడికి ఆ మహిళపై లైంగిక భావన ఉందని స్పష్టం చేసింది. 2014 జూలైలో తన భర్త ఇంట్లో లేని సమయంలో ఓ రాత్రి నిందితుడు తన కాలును తాకాడని మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.