న్యూఢిల్లీ, ఆగస్టు 29: పండ్లు, కూరగాయలను రెండు నెలలపాటు తాజా గా ఉంచే బయోడీగ్రేడబుల్ కోటింగ్ మెటీరియల్ను ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది పండ్లు, కూరగాయల నిల్వకాలాన్ని గణనీయంగా పెంచుతుందని, పండ్ల తో సహా ఈ పదార్థాన్ని తిన్నా ఏమీకాదని పరిశోధకులు వెల్లడించారు. ఆలుగడ్డ, టమాట, స్ట్రాబెరీ, నారింజ, యాపిల్, కివీ తదితర పండ్లు, కూరగాయలకు ఈ మెటీరియల్ కోటింగ్ వేసి పరిశోధనలు జరిపామని, దాదాపు రెండు నెలలపాటు తాజాగా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ వివరాలు ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.