మైసూరు : దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన మైసూరు క్యాంపస్లో సుమారు 700 మంది ట్రైనీలను ఉద్యోగం నుంచి తొలగించింది. వీరిని నిరుడు అక్టోబరులోనే నియమించుకుంది. ఈ చర్యను నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ఖండించింది. కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ, కనీస అర్హతలను సాధించలేకపోయారంటూ దాదాపు 400 మంది ఉద్యోగులను పిలిచి, అల్టిమేటమ్ లేఖలు ఇచ్చిందని చెప్పారు. దీనిపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ, 350 మంది కన్నా తక్కువ మందినే తొలగిస్తున్నామని చెప్పింది. ఉద్యోగులను నిర్బంధించి మ్యూచువల్ సెపరేషన్ లెటర్స్పై సంతకాలు చేయించుకున్నారని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలుజ ఆరోపించారు.