న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) మాడ్యూల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ రోదసీ దినోత్సవాల్లో దీనిని ప్రదర్శించింది. మన దేశంలోనే తయారు చేసిన అంతరిక్ష స్టేషన్ బీఏఎస్ మొదటి మాడ్యూల్‌ను 2028నాటికి ప్రారంభించేందుకు భారత దేశం ప్రయత్నిస్తున్నది.
2035 నాటికి ఐదు బీఏఎస్ మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నది. భూమి ఉపరితలం నుంచి 450 కి.మీ. ఎత్తులో భూ దిగువ కక్ష్యలో దీనిని ఉంచుతారు. ప్రస్తుతం ఉన్న ఆర్బిటాల్ ల్యాబొరేటరీలు ఏమిటంటే, ఐదు అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్.