ISRO | జీశాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న ఫాల్కన్-9.. తొలిసారిగా స్పేస్ఎక్స్తో ఇస్రో జట్టు..!
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ.. భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. తాజాగా భారత్‌కు చెందిన శాటిలైట్‌ని అంతరిక్షంలోకి స్పేస్ఎక్స్ కంపెనీని సహాయం కోరుతున్నది. ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్-3 ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. మార్క్-3 రాకెట్ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది.
అయితే, ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన జీశాట్ ఎన్2ని నింగిలోకి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రాకెట్ బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలో స్పేస్ఎక్స్ సహాయం కోరుతున్నది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. స్పేస్ఎక్స్ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం ఇదేకావడం విశేషం. ఇదిలా జీశాట్-ఎన్2 శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ని విస్తరించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Falcon 9 Rocket
- GSat-N2
- ISRO
- SpaceX
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

