బెంగుళూరు: చంద్రుడి అధ్యయనం కోసం చంద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవలే చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలో ఉంది. ఇక ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ .. మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది. త్వరలో సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1(Aditya L-1) మిషన్‌ను చేపట్టనున్నది. అయితే ఆదిత్య ఎల్-1 మిషన్‌కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో అప్డేట్ చేసింది. బెంగుళూరులో తయారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకున్నది. తొట్టతొటి సారి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో సమాయాత్తమైంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి.
PSLV-C57/Aditya-L1 Mission:
Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is getting ready for the launch.
The satellite realised at the U R Rao Satellite Centre (URSC), Bengaluru has arrived at SDSC-SHAR, Sriharikota.
More pics… pic.twitter.com/JSJiOBSHp1
— ISRO (@isro) August 14, 2023
ఆదిత్య ఎల్-1 ఏం చేస్తుందంటే..
ఈ మిషన్‌లో భాగంగా కేవలం సూర్యడిపైనే ఫోకస్ పెట్టనున్నారు. సౌర తుఫాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నది. ఆ శాటిలైట్ సుమారు 1500 కేజీల బరువు ఉంటుంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించనున్నారు. సూర్యుడి-భూమి వ్యవస్థలో ఉన్న ఓ కక్ష్యలో ఆ శాటిలైట్‌ను ప్రవేశపెడుతారు. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఆ కక్ష్య ఉంటుంది. సోలార్ వ్యవస్థను అధ్యయనం చేయడంలో ఆ శాటిలైట్ ఉపయోగపడనున్నది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ను స్టడీ చేసేందుకు ఏడు పేలోడ్స్‌తో ఆ స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కూడా స్టడీ చేయనున్నారు. చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన కొన్ని వారాల్లోనే ఈ పరీక్షను చేపట్టనున్నారు.