న్యూఢిల్లీ, జూన్ 27: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తదుపరి తరం రాకెట్ ఇంజిన్ విడి భాగానికి చెందిన కీలకమైన గ్రౌండ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో దేశపు ప్రధాన హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్(భారీ బరువులను మోసుకెళ్లే వాహక నౌకలో దీనిని వినియోగించే దిశగా ఓ ముందడుగు పడింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని ఇంజినీర్లు ఈ నెల 24న సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్ పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్(పీహెచ్టీఏ)కు చెందిన హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. ఈ పరీక్షలో 175 టన్నుల థ్రస్ట్(చోదక శక్తి) నమోదైందని పేర్కొంది.