ఆకాశ నేత్రం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దేశంలో తొలిసారిగా జియో- ఆర్బిట్‌లోకి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2,300 కిలోలకుపైగా బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
- జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దేశంలో తొలిసారిగా జియో- ఆర్బిట్‌లోకి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2,300 కిలోలకుపైగా బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మిషన్‌లో పాల్గొన్న ఓ సీనియర్ శాస్త్రవేత్త అభివర్ణించినట్లుగా ‘ఆకాశంలో కన్ను’గా అభివర్ణిస్తున్న ఈ ఉపగ్రహం రియల్ టైమ్ చిత్రాలను అందించనుంది. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ తదితర రంగాల్లో దేశానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉద్దేశించిన సబ్ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటించింది.
‘గూఢచారి ఉపగ్రహం’ కాదు
ఈవోఎస్-05ను ‘గూఢచారి ఉపగ్రహం’గా పేర్కొంటూ వస్తున్న ఊహాగానాలను అంతరిక్ష సంస్థ తోసిపుచ్చింది. స్పై అనేది ప్రతికూల పదమని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. ఈవోఎస్-05ను భారత్‌ను నిరంతరం స్కాన్ చేసి, పరిశీలించేందుకు రూపొందించిన బహుముఖ ప్రయోజన వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇది అందించే డేటా దేశ పౌరుల భద్రత, రక్షణను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని, ఈ ఉపగ్రహాన్ని తొమ్మిదేండ్ల పాటు పనిచేసేలా రూపొందించారని తెలిపారు. ‘జీఎస్ఎల్వీ ఎఫ్-17’ వాహనం అధునాతన ఈఓఎస్-05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.
భూ భ్రమణ వేగానికి సమానంగా..
ప్రస్తుతం అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో)లో పనిచేస్తున్నాయి. అయితే ఈవోఎస్-05 భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింగ్రోనస్ ఆర్బిట్‌లోకి చేరనుంది. ఆ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానంగా ప్రయాణిస్తుంది. దీనికి ముందు బుధవారం రాత్రి 23:30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ సజావుగా ముగిసిన అనంతరం రాకెట్ శుక్రవారం తెల్లవారుజామున 2: 55 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిర్ణీత సమయానికి దూసుకెళ్లింది. 2026లో ఇస్రోకు ఇది తొలి విజయవంతమైన ప్రయోగం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

