మహేంద్రగిరి: ఇస్రో బుధవారం రోజున కీలక పరీక్ష నిర్వహించింది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్టును బుధవారం నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఆ పరీక్ష జరిగింది. సుమారు 720 సెకన్ల పాటు ఆ పరీక్ష చేపట్టారు. ఆ క్వాలిఫికేషన్ టెస్ట్ విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. టెస్ట్ లక్ష్యాలను అందుకునేందుకు ఇంజిన్‌కు పరీక్ష నిర్వహించారు. అయితే ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగున్నట్లు ఇస్రో తెలిపింది. టెస్ట్ సమయంలో ఇంజిన్ పారామీటర్లు అన్నీ అందుకున్నాయి. హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ గగన్‌యాన్‌లో ఈ పరీక్ష కీలకమని ఇస్రో వెల్లడించింది. అతి సుదీర్ఘకాలం నిర్వహించిన ఈ టెస్టు ఓ మైలురాయి అవుతుందని ఇస్రో చెప్పింది. క్రయోజెనిక్ ఇంజిన్ సామర్ధ్యాన్ని అన్ని కోణాల్లో పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. అయితే ఇలాగే మరో నాలుగు సార్లు ఆ ఇంజిన్‌కు పరీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుమారు 1810 సెకన్ల పాటు క్రయోజెనిక్ ఇంజిన్‌ను టెస్ట్ చేస్తారు. గగన్‌యాన్ క్వాలిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం మరిన్ని పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.
Today, ISRO successfully conducted the qualification test of Cryogenic Engine for the Gaganyaan programme for a duration of 720 seconds at ISRO Propulsion Complex (IPRC), Mahendragiri, Tamil Nadu. Details: https://t.co/6hGrC6keBA pic.twitter.com/qB20tPsu3r
— ISRO (@isro) January 12, 2022