శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు చేపట్టాలనుకున్న ఈ రాకెట్ ప్రయోగాన్ని గురువారం సాయంత్రం 4.12 గంటలకు నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది.
పీఎస్ఎల్వీ సీ-59 ద్వారా నింగిలోకి పంపాల్సిన ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఏర్పడటమే ఈ వాయిదాకు కారణమని వెల్లడించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు (310 కిలోల బరువైన కరోనాగ్రాఫ్, 240 కిలోల బరువైన ఆక్యుల్టర్) ఉంటాయి. సూర్యుడి గుట్టు విప్పేందుకు కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం, తద్వారా సూరుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యం.