బెంగళూరు: పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం ద్వారా 2024 సంవత్సరాన్ని విజయంతో ముగించిన ఇస్రో 2025 ఆరంభంలోనే అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ60 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 99వ ప్రయోగం.
2025 జనవరిలో 100వ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ఈ ప్రయోగ తేదీ ఖరారు కావాల్సి ఉంది. జీఎస్ఎల్వీ-ఎఫ్15/ఎన్వీఎస్-02 పేరుతో ఈ ప్రయోగం జరగనుంది. ఇందులో భాగంగా జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(జీఎస్ఎల్వీ ఎంకే-II) రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1కే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకిప్రవేశపెట్టనున్నారు.