Somanath | సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు చేపట్టబోయే ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.
కాగా, చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపులో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టబోతోంది. శనివారం ఉదయం 11.50 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ (Countdown) ఈరోజు ప్రారంభమైంది. సరిగ్గా 24 గంటల కౌంట్‌డౌన్ తర్వాత పీఎస్ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని శనివారం ఉదయం 11.20 నిమిషాల నుంచి డీడీలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
Also Read..
Samantha | స్విమ్మింగ్‌పూల్‌లో రిలాక్స్ అవుతున్న సామ్.. ఫొటో వైరల్
Viral Video | పెళ్లి విందులో కుర్చీలతో కొట్టుకున్న అతిథులు.. వీడియో
Vivek Ramaswamy | నేను అధ్యక్షుడినైతే ఆ లక్ష్యాన్ని చేరుకుంటా.. రష్యాకు వివేక్ రామస్వామి భారీ ఆఫర్