Vivek Ramaswamy | నేను అధ్యక్షుడినైతే ఆ లక్ష్యాన్ని చేరుకుంటా.. రష్యాకు వివేక్ రామస్వామి భారీ ఆఫర్
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. తాజాగా రష్యాకు భారీ ఆఫర్ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తానంటూ ప్రకటించారు. అయితే, ఇవన్నీ జరగాలంటే రష్యా.. చైనాతో సైనిక కూటమి నుంచి వైదొలగాల్సి ఉంటుందని రామస్వామి ఓ కండిషన్ పెట్టారు.
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికల్లో పాల్గొంటున్నారు. వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యాకు రామస్వామి భారీ ఆఫర్ ఇచ్చారు.
చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యాను, చైనా నుంచి దూరం చేయాలని రామస్వామి అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికైతే ఒప్పందం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఉక్రెయిన్-రష్యాల మధ్య ప్రస్తుతం నియంత్రణ రేఖ ఉండేలా చేస్తానన్నారు. అదేవిధంగా నాటో కూటమిలోకి ఉక్రెయిన్ను అనుమతించబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తానంటూ ప్రకటించారు. అయితే, ఇవన్నీ జరగాలంటే రష్యా.. చైనాతో సైనిక కూటమి నుంచి వైదొలగాల్సి ఉంటుందని రామస్వామి ఓ కండిషన్ పెట్టారు.
‘నేను రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత నియంత్రన మార్గాలను స్తంభింపజేస్తాను. ఉక్రెయిన్ను నాటోలోకి అనుమతించను. ఇందుకు నేను కట్టుబడి ఉంటాను. పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ, ప్రతిఫలంగా నాకు ఇంకా గొప్పది కావాలి. రష్యా చైనాతో సైనిక సంబంధాలను విడిచిపెట్టాలి. అలాచేస్తే రష్యాతో పాశ్చాత్య ఆర్థిక సంబంధాలను తిరిగి కొనసాగిస్తాం’ అని రామస్వామి తెలిపారు. రష్యా-చైనా సైనిక కూటమి నేడు అమెరికా ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ముప్పు అని రామస్వామి అన్నారు.
Also Read..
Petrol Price | తీవ్ర ఆర్థిక సంక్షోభం.. పాక్ చరిత్రలో తొలిసారి రూ.300 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
Joe Biden | జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ గైర్హాజరు..! బైడెన్ ఏమన్నారంటే..?
One Nation One Election | ఒకే దేశం – ఒకే ఎన్నికలపై కమిటీని నియమించిన కేంద్రం..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

