Joe Biden | జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ గైర్హాజరు..! బైడెన్ ఏమన్నారంటే..?
Joe Biden | సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే, జిన్‌పింగ్ గైర్హాజరుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.
Joe Biden | సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) సహా పలు దేశాల అధ్యక్షులు హాజరుకాబోతున్నారు. అయితే ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు గైర్హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ఆయనకు బదులు ఆ దేశ ప్రధాని లి కియాంగ్ వస్తారని పేర్కొన్నాయి. అయితే, జిన్‌పింగ్ గైర్హాజరుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఆయన (జిన్‌పింగ్) జీ20 సమ్మిట్‌కు హాజరవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. విలేకరులతో సమావేశం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్ ఈ విధంగా స్పందించారు.
భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్ హాజరుకారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కూడా హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటీవలే వెల్లడించారు. అయితే పుతిన్ ఈ సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
One Nation One Election | ఒకే దేశం – ఒకే ఎన్నికలపై కమిటీని నియమించిన కేంద్రం..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

