న్యూఢిల్లీ, డిసెంబర్ 26: న్యూఢిల్లీ జిల్లాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. ఘటనా స్థలిలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి.
కార్యాలయం వెనుక భాగంలోని తోటలో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్, ఇతర తనిఖీ బృందాలను రప్పించి అణువణువూ గాలిస్తున్నారు. 2021 జనవరిలో ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు సంభవించింది.