న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ISIS) గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దల్లా మక్కి ముస్లి అల్ రిఫాయి .. అమెరికా నిర్వహించిన వైమానిక దాడిలో హతమయ్యాడు. అబ్దల్లా మక్కిని అబూ ఖదీజా అని కూడా పిలుస్తారు. ఇరాకీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అమెరికా వైమానిక దళం దాడి చేపట్టింది. అబ్దల్లా మక్కి.. ఐసిస్ గ్రూపులో రెండవ స్థాయి కమాండెంట్‌గా ఉన్నాడు. మార్చి 13వ తేదీన జరిగిన ఆ స్ట్రయిక్‌లో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించినట్లు తెలుస్తోంది.
అమెరికా మిలిటరీ అధికారుల ప్రకారం.. అబూ ఖాదిజా .. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన లాజిస్టిక్స్, ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకునేవాడు. డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా అబూ ఖాదిజా మృతదేహాన్ని ద్రువీకరించారు. అబూ ఖాదిజాను హత మార్చిన అంశంపై ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుదానీ స్పందించారు. ఇరాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఖాదిజా మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది అని తెలిపారు. అమెరికా సహకారంతో ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా చేపట్టినట్లు ఇరాక్ ప్రధాని వెల్లడించారు.
CENTCOM Forces Kill ISIS Chief of Global Operations Who Also Served as ISIS #2
On March 13, U.S. Central Command forces, in cooperation with Iraqi Intelligence and Security Forces, conducted a precision airstrike in Al Anbar Province, Iraq, that killed the Global ISIS #2 leader,… pic.twitter.com/rWeEoUY7Lw
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025