న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు, భద్రతా దళాలను ప్రభుత్వం ఆదేశించింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యలు, బంగ్లాదేశ్లో పాకిస్థానీ సైనిక, ఐఎస్ఐ అధికారుల పర్యటనల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వంతో, అక్కడి రాడికల్ ఇస్లామిస్టు మూకలతో సంబంధాలను పటిష్టపరచుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నది.