Isha Ambani : ఇటలీ (Italy) లోని వెనిస్ నగరం (Venice city) లో నిర్వహించిన 61వ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘వెనిస్ బినాలే (Venice Biennale)’ లో ‘నేషనల్ పెవిలియన్ ఆఫ్ ఇండియా (National Pavilion of India)’ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (Nita Mukesh Ambani Cultural Centre) తరపున ఇషా అంబానీ (Isha Ambani) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇషా అంబానీ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. భారతీయ కళలను ప్రపంచానికి చాటిచెప్పడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టంచేశారు. మారుతున్న భారతీయ సంస్కృతిని గురించి వివరించారు.
‘భారతదేశం ఒక సురక్షితమైన ఇల్లు లాంటి భావన’ అని ఇషా అభివర్ణించారు. వెనిస్ నగరంతో భారతదేశానికి ఉన్న బంధాన్ని గుర్తుచేశారు. మన పూర్వీకులు గర్వపడేలా, భావితరాలకు వారసత్వంగా అందించేలా.. భారత్, వెనిస్ మధ్య నిరంతరం అర్థవంతమైన చర్చ కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. కళలపట్ల తన తల్లి నీతా అంబానీకి ఉన్న దార్శనికతను ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశంలోని అత్యుత్తమ కళలను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు, ప్రపంచస్థాయి కళలను భారత్కు తీసుకురావడమే తమ సెంటర్ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు.
కాగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో ‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్’ ను వెనిస్ బినాలేకు తీసుకెళ్లి మన దేశ అద్భుత కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించింది. దాంతో ప్రపంచ కళారంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరిసింది. కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురానుంది.
ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని పెంచింది. ప్రఖ్యాత జ్యుయెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.