న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) లో చోటుచేసుకున్న తాజా సంక్షోభ పరిణామాలపై సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. ప్రధాని మోడీ చెప్పుకునే మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదేనేమో..?’ అని ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీగారు చెప్పిన మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇదే కావచ్చు’ అని సిబల్ ట్విటర్లో వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ అక్కడి కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత దేశం ప్రజస్వామ్యానికి తల్లి లాంటిదని చెప్పారు. ఈ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ కపిల్ సిబల్.. బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత అజిత్ పవార్ ఇవాళ ఎన్సీపీని చేల్చి బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుకు తన మద్దతు ప్రకటించారు. మహా సర్కారులో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి, బాధ్యతలు చేపట్టారు.
Ajit Pawar(NCP)
To be sworn in as Deputy Chief Minister of Maharashtra along with 9 others as Ministers in the Shinde led governmentI guess this is the mother of democracy that Modiji was talking about in his address to the US Congress !
— Kapil Sibal (@KapilSibal) July 2, 2023