బెటియా: ఐ లవ్ మహమ్మద్.. ఐ లవ్ మహాదేవ్(I Love Mahadev) వివాదంపై శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ స్పందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నుంచి తప్పుదోవ పట్టించేందుకు ఐ లవ్ మొహమ్మద్, ఐ లవ్ మహాదేవ్ వివాదం సృష్టించినట్లు ఆయన ఆరోపించారు. మహాదేవుడిని ఆరాధిస్తామా లేక ప్రేమిస్తామా అని ఆయన ప్రశ్నించారు. ఇది మహాదేవుడికి అవమానం అన్నారు. మహమ్మద్ గురించి తనకు తెలియదన్నారు. మహమ్మద్‌తో ఉన్నవాళ్లకు ఆయన గురించి తెలుస్తుందన్నారు. కానీ ఐ లవ్ మహాదేవ్ అని అనడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు చేయడం గౌరవమా .. అవమానించడమా అని ప్రశ్నించారు. ఇది మహాదేవుడిని అమర్యాదగా చూడడమే అన్నారు. ఇది మహాదేవుడికి అవమానం అన్నారు. మహాదేవుడి గురించి మనం అలా మాట్లాడం అని స్వామి అవిముక్తేశ్వరానంద పేర్కొన్నారు.
గత కొన్ని రోజుల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఐ లవ్ మహహ్మద్ పోస్టర్లతో అక్కడ నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో బరేలీ అధికారులు పట్టణంలో మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను 48 గంటల పాటు నిషేధించారు. అలా హజ్రత్ దర్గా, ఇత్తెహాద్ ఈ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రాజా ఖాన్ ఇంటి ముందు ముస్లింలు భారీ సంఖ్యలో ఐ లవ్ మహమ్మద్ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో కాన్పూర్‌లో యూపీ పోలీసులు ఫ్లాగ్ మార్చింగ్ నిర్వహించారు. బరేలీలో జరిగిన నిరసనలకు సంబంధించిన కేసులో ఐఎంసీ జాతీయ కార్యదర్శి నఫీస్ ఖాన్, ఆయన కుమారుడు ఫర్మన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఐఎంసీకి చెందిన ఫేస్బుక్ పేజీని ఫర్మన్ ఆపరేట్ చేస్తున్నాడు.
#WATCH | Bettiah, Bihar | On ‘I love Muhammad-Mahadev’ row, Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, “… ‘I love Mohammed, I love Mahadev’ row has been started to distract the public from the real issues. Is Mahadev a matter of worship or love? This is an… pic.twitter.com/4WcmhUNkJC
— ANI (@ANI) October 4, 2025