Diya Kumari: రాజస్థాన్ సీఎం రేసులో దియా కుమారి !
Diya Kumari: దియా కుమారి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆమె రాజస్థాన్ సీఎం రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ.. రాజస్తాన్‌లో విజయం దిశగా వెళ్తోంది. రాచ కుటుంబానికి చెందిన దియా.. లేదా మాజీ సీఎం వసుంధరాకు సీఎం పదవి దక్కుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది.
జైపూర్: బీజేపీ నేత దియా కుమారి(Diya Kumari).. రాజస్థాన్ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీ అయిన ఆమె.. జైపూర్‌లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆ స్థానం నుంచి విజయం దిశగా ఆమె వెళ్తోంది. అయితే పార్టీ అధిష్టానమే సీఎం నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. తనను సీఎంగా చూడాలని రాజస్థాన్ ప్రజలు ఆశిస్తున్నారని ఆమె అన్నారు. పార్లమెంటరీ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. అవినీతి కాంగ్రెస్ సర్కారును ప్రజలు కూల్చివేశారన్నారు. మాజీ సీఎం వసుంధరా రాజే కూడా సీఎం రేసులో ఉన్న విషయం తెలిసిందే.
రాచ కుటుంబంలో పుట్టిన దియా కుమారి.. ఢిల్లీ, ముంబై, జైపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆమె ఫైన్ ఆర్ట్స్ చదివారు. గ్రాడ్యుయేట్ డిప్లామా పూర్తి చేశారు. ఫిలాసఫీలో ఆమె డాక్టరేట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

