IRDAI | న్యూఢిల్లీ, మే 29: ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారుల నుంచి క్యాష్‌లెస్ చికిత్స కోసం వచ్చిన విజ్ఞప్తులపై సదరు బీమా కంపెనీలు ఒక్క గంటలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఓ మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఆరోగ్య బీమా వంటి అత్యవసర రంగంలో క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను వీలైనంత వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ అభిప్రాయపడింది. అందుకే ఈ క్లెయిమ్‌లు వచ్చిన గంటలోగా ఏ సంగతన్నది తేల్చేయాలని ఇన్సూరర్లను ఆదేశించింది. కాగా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై తాజాగా విడుదలైన ఈ మాస్టర్ సర్క్యులర్‌తో గతంలో జారీ చేసిన 55 సర్క్యులర్లు రైద్దెపోయాయి. ఆరోగ్య బీమా పాలసీల్లో పాలసీదారులకు అందుబాటులో ఉండే అన్ని అర్హతలను ఈ మాస్టర్ సర్క్యులర్‌లోనే ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఈ సర్క్యులర్‌ను గొప్ప ముందడుగుగా కూడా అభివర్ణించింది. జూలై 31లోగా తామిచ్చిన ఈ మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని కూడా గడువు పెట్టింది.
వేగంగా సెటిల్మెంట్లు..
నిర్ధిష్ట సమయంలోగా 100 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ జరగాలన్నదే ఈ మాస్టర్ సర్క్యులర్ ఉద్దేశమన్న ఐఆర్డీఏఐ.. పాలసీ రెన్యువల్స్, సర్వీసింగ్, సమస్యల పరిష్కారానికి సాంకేతికంగా లేదా అందుబాటులో ఉన్న అన్ని ప్రభావవంతమైన చర్యలనూ ఆరోగ్య బీమా కంపెనీలు తీసుకోవాలన్నది. ఇక ప్రతీ పాలసీ డాక్యుమెంట్‌తో బీమా సంస్థ అందించే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్) ఎంతో ముఖ్యమని చెప్పింది. బీమా అంటే.. బీమా చేసుకున్న మొత్తం, కవరేజీ, పరిధిలోకిరాని అంశాల వివరాలు, పరిమితులు, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్స్ ఇలా అన్నింటి సమాహారమని వివరించింది.
బీమా పోర్టబిలిటీపై..
ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీ) పోర్టల్‌పై బీమా పోర్టబిలిటీకి పాలసీదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు సంబంధించి నిర్ధిష్ట కాలవ్యవధులను ప్రస్తుత బీమా సంస్థకు, వెళ్లాలనుకునే కొత్త బీమా సంస్థకు స్పష్టం చేశామని ఐఆర్డీఏఐ తెలిపింది. ఇక బీమా ప్లాన్లు, రైడర్లకు సంబంధించి దవాఖానలకు, బీమా సంస్థలకు, పాలసీదారులకు స్పష్టత ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్న ఐఆర్డీఏఐ.. అందరికీ అందుబాటు ధరల్లో ఆరోగ్య బీమా అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పింది.
సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలు