న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రైల్వే బుకింగ్ వెబ్సైట్ ‘ఐఆర్సీటీసీ’ సేవల్లో మరోమారు అంతరాయం ఏర్పడింది. శనివారం వెబ్సైట్ డౌన్ కావడంతో దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సహా పలు రకాల సేవలు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 10 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది.
ఐఆర్సీటీసీ యాప్ సేవల్లో కూడా అంతరాయం నెలకొన్నది. దీని కారణంగా ఉత్తరాదిన ఛట్ పూజ వేళ సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు.