న్యూఢిల్లీ, మే 22: సాధారణంగా అయస్కాంతానికి ఇనుము, స్టీల్‌ను ఆక ర్షించే లక్షణాలు ఉంటాయి. అయితే అ లాంటి అరుదైన శరీర లక్షణాలు ఉన్న ఇరాన్‌కు చెందిన అబోల్ఫజల్ సాబెర్ మొ ఖ్తరి అనే వ్యక్తి ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులను సాధించాడు.
2021లో ఒంటిపై 64 స్పూన్లు, 2023లో 85 స్పూన్లు ఎలాంటి ఆధారం లేకుండా నిల బెట్టుకుని రెండు గిన్నిస్ రికార్డులు పొందా డు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి ఈసారి ఏకంగా 96 స్పూన్లను తన ఒంటిపై నిలబెట్టుకుని మూడోసారి గిన్నిస్ రికార్డును సాధించాడు.