న్యూఢిల్లీ: ఐటీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమాలు) సవరణ నిబంధనలు, 2023 (ఐటీ సవరణ నిబంధనలు-2023)లపై భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
ఇలాంటి నిబంధనలపై ప్రకటన విడుదల చేసే ముందు మీడియా సంస్థలతో అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించింది. కేంద్రం సహజ న్యాయ సూత్రాలను అతిక్రమించినట్టేనని ఐఎన్ఎస్ అభిప్రాయపడింది.