బెంగుళూరు: అమెరికా అంతరిక్ష శిక్షణా కేంద్రం నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వరంలో.. ఇద్దరు భారతీయ వ్యోమగామలు(Indian Astronauts) అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. అయితే ఆ ఇద్దరికి చెందిన ప్రాథమిక శిక్షణ పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రైమ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, బ్యాకప్ గ్రూపు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ .. అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. ఏక్సియమ్ మిషన్ 4 కోసం ఈ ఏడాది ఆగస్టు నుంచి వాళ్లు శిక్షణలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది.
ఇద్దరు గగనయాత్రికుల ప్రాథమిక శిక్షణ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో పేర్కొన్నది. ఆ శిక్షణ సమయంలో.. మిషన్ సంబంధిత గ్రౌండ్ ఫెసిలిటీ టూర్స్, మిషన్ లాంచ్ ఫేస్, స్పేస్ఎక్స్ సూట్ ఫిక్స్ చెక్స్, ఫుడ్ ఆప్షన్స్ గురించి శిక్షణ తీసుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ గురించి కూడా భారతీయ వ్యోమగాములు శిక్షణ పొందారు. అంతరిక్షంలో ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తొలి దశ శిక్షణలో తెలిపారు.
🚀 Gaganyaan on a Global Stage 🌏
The initial phase of training for Gaganyatris, part of the historic ISRO-NASA joint mission to the International Space Station, has been successfully completed.
Prime Crew: Group Captain Shubhanshu Shukla
Backup Crew: Group Captain Prasanth…— ISRO (@isro) November 29, 2024