న్యూఢిల్లీ : సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గుంజన్ ఓ పెండ్లి వేడుకలో పాలక్‌తో చేసిన చోలే చావల్‌ను ట్రై చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాలక్ గ్రేవీతో చోలే చావల్ టేస్ట్ చాలా బావుందని వీడియోలో గుంజన్ కితాబిచ్చింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు.
Koi roko in influenza ko.. intresting dish…ffs that's how most Indians eat dal chawal and sabji… pic.twitter.com/i6AzYDw1Fd
— Pablo Pillai Unofficial (@dakuwithchaku) January 22, 2023
ఈ వైరల్ వీడియోను గుంజన్ షౌట్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా పబ్‌లో పిళ్లై అనే యూజర్ ట్విట్టర్లో రీషేర్ చేశారు. గుంజన్ ఈ షార్ట్ క్లిప్‌లో పెండ్లి వేడుక కోసం ఓ చెఫ్ చోలె చావల్‌ను తయారుచేయడాన్ని చూపుతుంది. ఈ డిష్‌ను చేసేందుకు ఓ వ్యక్తి తొలుత పెద్ద కడాయ్‌లో రైస్, నెయి్య వేసి ఆపై చోలే, పాలక్‌లను కలిపి మంచిగా మిక్స్ చేయడం కనిపిస్తుంది.
ఆపై డిష్ మీద చాట్ మసాలా చల్లి రెడీ చేస్తాడు. ఈ డిష్ చాలా బాగుందని గుంజన్ చెప్పగా నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసినప్పటి నుంచి 3 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఇదేం డిష్ అని పలువురు యూజర్లు పెదవివిరిచారు. పెండ్లిలో మిగిలిపోయిన వంటలను మిక్స్ చేసి తినేస్తారా అని ఓ యూజర్ చురకలు వేశారు.